Categories: న్యూస్

‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో టెర్రిఫిక్ రెస్పాన్స్…

1800కు పైగా థియేటర్లలో టీజర్ విడుదల

టైమ్‌కు తినాలన్నారు…
ఆమె తినే పరిస్థితిలో లేదు.
బాగా నిద్రపోవాలన్నారు…
కానీ, ఆమెకు నిద్ర కరువైంది.
జాగ్రత్తగా నడవాలని చెప్పారు…
ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది.
దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు…
ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.
సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు…
అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది.
చివరకు ఏమైంది? అనేది ‘యశోద’లో చూడాలని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

‘యశోద’లో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే… అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నారు. టీజ‌ర్‌లో కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌పుట్ కూడా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్ అట్ట్రాక్ట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కనిపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. జాతీయ స్థాయిలో దాదాపు 1400లకు పైగా థియేటర్లలో టీజర్ విడుదల చేశాం. సాధారణంగా థియేటర్లలో ట్రైలర్ విడుదల చేస్తారు… ఇన్ని థియేటర్లలో ఈ విధంగా టీజర్ విడుదల చేయడం ఇదే ప్రథమం. థియేటర్లలో, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సమంత నటన, చిత్ర నిర్మాణ విలువల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. సమంత ఎంతో అకింత భావంతో యాక్షన్ సీన్స్ చేశారు. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. కథా పరంగా ఇంత వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది.  టీజ‌ర్‌కు మించిన థ్రిల్ థియేటర్లలో ఇస్తుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Tfja Team

Recent Posts

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

1 hour ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

3 days ago