న్యూస్

‘ది ఘోస్ట్’- సెప్టెంబర్ 25న కర్నూలులో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున- సోనాల్ చౌహాన్ ల అద్భుతమైన కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.

తర్వాతి భారీ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

5 hours ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

5 hours ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

6 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

6 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

7 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

7 hours ago