పేక మేడలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ‘ఎవరికీ చెప్పొద్దు’ థియేటర్ మరియు ఓటిటి లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ (Vinodh Kishan). గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ మరియు హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : సినిమా ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభిస్తుంది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారు చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులు కూడా మేము ఏ ప్రమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

19 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago