సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ
చేతుల మీదుగా అభిమానికి ఆర్ధిక సాయం
ఖమ్మంకి చెందిన బానోత్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్. వీరాభిమాని. ఆయనకి 3నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రావివేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న “ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్” టీం తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో… సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా 35000/- ఆర్ధిక సాయం అందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కర్రి వెంకటేష్ సారథ్యంలో వాసం ముత్తు, పెరిచర్ల గణపతి రాజు, అన్నవరం సమక్షంలో బాధితుడు భానోత్ శ్రీనివాస్ కి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా కర్రి వెంకటేష్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం చేపట్టిన 20వ కార్యక్రమం ఇది. మా గ్రూప్ లో వున్న సభ్యులుకే కాకుండా మానవత్వంతో కష్టాల్లో వున్న వెంకటేష్ అభిమానులకి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం.
థియేటర్స్ దగ్గర చేసే అనవసర ఖర్చులను తగ్గించుకొని, సాటి అభిమానుల కుటుంబాలకు సాయ పడాలన్న ఒక సంకల్పంతో ఈ టీం ఏర్పాటు చేసుకున్నాం. టీం సభ్యులందరూ ఒకే మాట మీద వుండటం వలన ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన ధీరజ అప్పాజీకి కృతజ్ఞతలు తెలిపారు!!
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…