టాలీవుడ్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.  ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు  ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులు అందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. డీవోపీ రాం రెడ్డిగారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఇందులో నేను చాలా అందంగా వున్నాని చెబుతున్నారు.  నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి కిథాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. మాటల రచయిత అబ్బూరి రవి నాంది సినిమా నుండి పరిచయం. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఒక పాట కూడా పాడారు. ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్ డే. ఆయనకి గిఫ్ట్ 25న ఇస్తాం. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్ .. ఇద్దరికీ కంగ్రాట్స్. రాజేష్ కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు గారిలానే పెద్ద నిర్మాత కావాలి. మోహన్ గారు చాలా ప్రతిభ వున్న దర్శకుడు. కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అందరం ఒక టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. అనంది గారు ఈ సినిమా చేస్తున్నపుడు బేబీకి బర్త్ ఇచ్చి మూడో నెల. ఆమె చాలా కష్టపడతూ ఏ రోజు కష్టాన్ని బయటికి చెప్పాకుండా చేశారు. ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది.  నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్. మాకు ఎల్లవేళలా తోడుండే వంశీ- శేఖర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వారి సపోర్ట్ మర్చిపోలేనిది. మాకు, మా టీంకి వారి సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి. ఇందులో నేను టీచర్ గా కనిపిస్తా. ఈ సందర్భంగా నేను స్టూడెంట్ గా వున్నపుడు  కొన్ని యాక్టింగ్ క్లాసులు చెప్పిన సుమ గారికి కూడా కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ తో కలిసి పని చేయడం అనందంగా వుంది. అన్ని బాషలలో ఆకట్టుకునే సత్తా వున్న సినిమా ఇది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత మోహన్ దర్శకత్వంలోనే హిందీలో కూడా ఈ సినిమా చేయాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... అల్లరి నరేష్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అల్లరి నుండి ఫాలో అవుతున్నా. ఆయన ఫన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తా. గమ్యం, శంభో శివ శంభో లో ఆయన డిఫరెంట్ గా చేస్తే ఇంకా నచ్చేది. నరేష్ మొదటి నుండి అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పెద్ద సక్సెస్ అవ్వాలి. మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' గురించి నిర్మాత రాజేష్ గారు చెప్పారు. చాలా కంటెంట్ వున్న సినిమా అనిపించింది. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి కథలు ఎంచుకోవడంలో మంచి టేస్ట్ వుంది. మారేడుమిల్లి అంటే నాకు చాలా ఇష్టం.'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పేరు పెట్టి అక్కడే సినిమా తీసిన దర్శకుడు మోహన్ గారికి కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా సహజంగా నటిస్తారు. . 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మంచి పాజిటివ్ టీం. 25 తేదిన అందరూ థియేటర్ కి వచ్చి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను. ఆనంది మాట్లాడుతూ.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. మూడు నెలల బేబీతో ఈ సినిమా చేశా.  టీం ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పుడూ మర్చిపోలేను.  నాపై ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నాంది తర్వాత నరేష్ గారి తో పని చేయడం చాలా ఆనందంగా వుంది. నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించిన రాజేష్ గారికి స్పెషల్ థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు. చిత్ర దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ.. ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ నరేష్ గారికి థాంక్స్ చెబుతూనే వుంటాను. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథ. నిర్మాతలు రాజేష్ గారికి కృతజ్ఞతలు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘు బాబు.. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కడలి, శ్రీ చరణ్, ఎడిటర్ ప్రసాద్, పృథ్వీ మాస్టర్, శేఖర్ మాస్టర్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు'' తెలిపారు. చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతుంది. అందరూ థియేటర్లో చూసి నా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'' అన్నారు. నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. నాంది సినిమా వలనే నన్ను ఇక్కడికి పిలిచారు. దీనికి కారణం నరేష్ గారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మంచి సినిమాని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిర్మాత రాజా నా బ్రదర్ లాంటి వారు. చాలా సినిమాలని పంపిణీ చేసారు. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నరేష్ గారితో పాటు ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. …

3 years ago

ఆస్ట్రేలియా ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి – మంత్రగత్తె’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్ష‌ణ చిత్రం ‘దహిణి - మంత్ర‌గ‌త్తె’. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ వేదిక‌ల‌పై ఈ సినిమా…

3 years ago

నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించిన దిల్ రాజు

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో…

3 years ago

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం !!

గోవాలో జరిగే 53వ IFFI - 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of…

3 years ago

కిరణ్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా…

3 years ago

‘విజయానంద్’… ట్రైలర్ విడుదల

ఎంటైర్ ఇండియాలో అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. ఈ సినిమాను పాన్…

3 years ago

నచ్చింది గర్ల్ ఫ్రెండూ..ప్రేక్షకులకు నచ్చుతుంది..దర్శకుడు శశికిరణ్

అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై పై ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జెన్నీఫర్ ఇమ్మాన్యూయెల్ జంటగా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ…

3 years ago

ధనుష్ ‘సార్’ నుంచి ‘ మాస్టారు… గీతం విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్టార్ యాక్ట‌ర్‌ 'ధనుష్'తో జతకడుతూ 'సార్'  చిత్రాన్ని శ్రీమతి…

3 years ago

‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ఈ 13న స్క్రీనింగ్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.‘లాఠీ’ మూవీ మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ను  నవంబర్ 13వ తేది సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన మేకర్స్ ఈ మేరకు ఆహ్వానం పలికారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది.లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్  రచయితగా పని చేస్తున్నారు. నటీనటులు : విశాల్, సునయన సాంకేతిక విభాగం : నిర్మాతలు : రమణ, నంద దర్శకత్వం : ఏ వినోద్ కుమార్ బ్యానర్ : రానా ప్రొడక్షన్స్ రచయిత : పొన్ పార్థీబన్ మ్యూజిక్ : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్ స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి పీఆర్వో : వంశీ-శేఖర్

3 years ago

అచీవర్ చిత్రం ట్రైలర్ విడుదల…

హాజరైన సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మొగులపల్లి ఉపేంద్ర, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ…సాహసోపేతమైన చిన్నారుల కథాంశం..: దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ ప్రతిసారీ కమర్షియల్ సినిమాలే…

3 years ago