టాలీవుడ్

‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి  ప్రేక్షకుల…

3 years ago

గాలోడు విజయం ప్రతీ ఒక్కరిది.. దర్శక, నిర్మాత రాజశేఖర్ రెడ్డి

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాలోడు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి…

3 years ago

NC22 టైటిల్ ‘కస్టడీ’ఫస్ట్ లుక్ విడు దల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగుతమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది.NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22  ప్రాజెక్ట్ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ...  అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి "కస్టడీ"అనే  పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌ లో కనిపించారు. నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ "ఎ. శివ" పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌ లో ప్రజంట్ చేశారు, వెంకట్ ప్రభు తన ప్రతి చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్ ఇవ్వడంలో కూడా దిట్ట. 'కస్టడీ' కి 'ఎ వెంకట్ ప్రభు హంట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. 'మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు సాంకేతిక  విభాగం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు నిర్మాత: శ్రీనివాస చిట్టూరి బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సమర్పణ: పవన్ కుమార్ సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్ ఎడిటర్: వెంకట్ రాజన్ డైలాగ్స్: అబ్బూరి రవి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్…

3 years ago

వెండితెరపై ‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 వసంతాలు

కొందరి ప్ర‌స్థానం విన్నా, చదివినా మ‌న జీవితానికి స‌రిప‌డ ప్రోత్సాహం ల‌భిస్తుంది. ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండేల్లో సుస్థిర…

3 years ago

నాగ చైతన్యNC 22 ఫస్ట్ లుక్ రేపు విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్…

3 years ago

వాల్తేర్ వీరయ్యనుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేర్ వీరయ్య' సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్…

3 years ago

వైష్ణవి చైతన్య బేబీ టీజర్‌ విడుదల

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్​‍ పతాకంపై ఎస్కేఎన్‌, దర్శకుడు మారుతి సంయుక్తంగా…

3 years ago

ధమాకానుండి డు డు సాంగ్ నవంబర్ 25న విడుదల

  మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా "ధమాకా" నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,  సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

3 years ago

డిసెంబర్ 9న విడుదలకానున్న లెహరాయి చిత్రం

యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీ "లెహరాయి" ట్రైలర్ విడుదల,డిసెంబర్ 9న విడుదలకానున్న చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న…

3 years ago

హనుమాన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

'హను- మాన్' పాన్ వరల్డ్ కంటెంట్ వున్న చిత్రం.. విజువల్ వండర్ గా వుంటుంది :  తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హను-మాన్ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు ఊహాతీతమైన కంటెంట్ తో వచ్చారు. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం 'సుప్రీమ్ బీయింగ్' రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో  వున్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ 'మ్యాన్ ఆఫ్ డూమ్' గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని  కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ,  రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి. ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. శివేంద్ర తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో  స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేశాడు. సంగీత దర్శకుడు గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో మంత్రముగ్ధుల్ని చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగళ ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. వీఎఫ్ ఎక్స్  వర్క్ అత్యన్నత క్వాలిటీతో సన్నివేశాలను కొత్త స్థాయికి ఎలివేట్ చేసింది. తేజ సజ్జ సూపర్ హీరోగా చాలా కన్విన్సింగ్‌ గా ఉన్నాడు. అతని గెటప్ , బాడీ లాంగ్వేజ్, యాక్షన్  ప్రతిదీ అద్భుతంగా వుంది. అమృత అయ్యర్ ఏంజెల్ లా కనిపిస్తుంది. మిగతా వారు కూడా పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎప్పుడెప్పుడు సినిమాని బిగ్ స్క్రీన్‌లపై చూడాలనే ఆసక్తి నెలకొంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు.  సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్. ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారి కి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయన తో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా నిర్మాతలు  నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. హను మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్ సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హను మాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఎదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటి సారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హను మాన్ మీద సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే అధీర అనే ఒక సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. హను మాన్ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి జాంబీ రెడ్డి చేశాం. హను మాన్ కి తేజనే ఎందుకు తీసుకున్నామని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్‌ డాగ్‌ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ అలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి.. అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ. విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమా ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళుతున్నాయి. హను మాన్ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం. హను మాన్ పాన్ వరల్డ్ ఫిల్మ్. నిజంగా చాలా గొప్ప సినిమా చేశాం'' అన్నారు అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హను మాన్ టీజర్ అద్భుతమనిపించింది. అనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తేజ సజ్జా మీ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది'' అన్నారు.  ఈ వేడుకలో శ్రీనాగేంద్ర తంగాల, శివేంద్ర, గౌరా హరి, గెటప్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

3 years ago