సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ…
వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు…
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ''లచ్చమమ్మో' వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్
Adivi Sesh emerged as one of the most bankable actors of Telugu cinema after scoring a series of hits. He…
నైట్రో స్టార్ సుధీర్ బాబు18వ చిత్రానికి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సెహరితో ఆకట్టుకున్న ట్యాలెంటడ్ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. తన రెండవ సినిమా కోసం భారీ కాన్వాస్ తో కూడిన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. ఎస్ ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.“అక్టోబర్ 31న మాస్ సంభవం” అని ఇటీవల ప్రకటించిన నిర్మాతలు.. బిగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ చిత్రానికి ‘హరోం హర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేసారు. ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని తెలియజేస్తోంది. కాన్సెప్చువల్ టైటిల్ వీడియో సినిమా సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ స్కేల్ ని తెలియజేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. "ఇంగా సెప్పేదేం లేదు... సేసేదే..." అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.టైటిల్ వీడియో ఆద్యంతం అద్భుతంగా ఉంది. చివర్లో సుధీర్ బాబు మాస్ గెటప్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ ఇచ్చింది.ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రమేష్ కుమార్ జి సమర్పిస్తున్నారు.'హరోం హర' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. తారాగణం: సుధీర్ బాబు సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక నిర్మాత: సుమంత్ జి నాయుడు సమర్పణ - రమేష్ కుమార్ జి సంగీతం: - చైతన్ భరద్వాజ్ డీవోపీ - అరవింద్ విశ్వనాథన్ బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పీఆర్వో: వంశీ-శేఖర్
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'బనారస్' విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ? ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది. పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది. ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ? టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ? జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది. కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ? కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ? నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది. తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ? తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం. జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు. కొత్తగా చేయబోతున్నా సినిమాలు ? మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.
అవార్డు సినిమాల దర్శకుడిగా నరసింహ నందికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. "1940లో ఒక గ్రామం'',"'కమలతో నా ప్రయాణం", "జాతీయ రహదారి" వంటి సామాజిక ఇతివృత్తంతో అనేక…
చిత్రం అక్టోబర్28 నుండి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ఆ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడాలి అనుకున్న సూపర్‌స్టార్ కృష్ణ…
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని…
లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం…