సింహా ప్రధాన పాత్రలో హాల్సియాన్ మూవీస్ , ఎంఎఫ్ఎఫ్ ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెం 1 గా జెవి మధు కిరణ్ దర్శకత్వంలో నూతన చిత్రం "రావణ కళ్యాణం" పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇవ్వగా, వివి వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్, సింహా సమర్పకులు. సందీప్ మాధవ్ , రాజేంద్ర ప్రసాద్, దీపికా, శత్రు, మధునందన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనంతరం సింహా మాట్లాడుతూ.. "రావణ కళ్యాణం" చాలా ఆసక్తికరమైన కథ. వంగవీటి, జార్జ్ రెడ్డి చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసిన శాండీ ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. జాతిరత్నాలు చిత్రంలో సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. శరత్ రవి, శత్రు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం గల నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఈ సినిమా చుస్తునప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎక్సయిట్ అవుతారు'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. "రావణ కళ్యాణం" పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. తెలుగు, తమిళ్. హిందీ, కన్నడలో ఒకేసారి విడుదల చేయబోతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. భవానీ ప్రసాద్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తారాగణం : సింహా, సందీప్ మాధవ్, రాజేంద్ర ప్రసాద్, దీపికా , రీతు గాయత్రి (పరిచయం), శత్ర, రాజ్‌కుమార్ కాసి రెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్ , అనంత్ తదితరులు సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం- జెవి మధు కిరణ్ సినిమాటోగ్రఫీ - సిద్దం మనోహర్ సంగీతం- రాధన్ ఎడిటర్- శ్రీకాంత్ పట్నాయక్ డైలాగ్స్- భవానీ ప్రసాద్ యాక్షన్ - గణేష్ ఆర్ట్ - దేవా లిరిక్స్- రెహమాన్, రాంబాబుగోసల, కాసర్ల శ్యామ్ కొరియోగ్రఫీ- జానీ, షరీఫ్ పీఆర్వో - వంశీ శేఖర్
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ . ప్రముఖ దర్శకుడు కొరటాల…
చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్…
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్కామ్, యాక్షన్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, హరి హర వీర మల్లు చిత్రాలకు స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఫుకెట్ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్ ను, స్పెయిన్ లో ఒక చిన్న షెడ్యూల్ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
ఇళయరాజా సంగీతం వహించిన సినిమా మ్యూజిక్ స్కూల్. బుడాపెస్ట్ లో నేపథ్య సంగీతానికి తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో నిన్న రికార్డింగ్ పూర్తి చేశారు. ఈ…
బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి…
ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు…
సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్ రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్, జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి…
హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్…
యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి…