ఇంటర్వ్యూలు

దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ…

ప్రశ్న: 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'... సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి!గౌతమ్ మీనన్ : మేం…

2 years ago

ఫ్యామిలీ ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ “నేను మీకు బాగా కావాల్సినవాడిని

ఈ నెల 16న గ్రాండ్ గా 550 థియేటర్స్ లలో విడుదల అవుతున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం…

2 years ago

హీరోయిన్ సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ

గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్, శింబు... ముగ్గురితో పని చేయాలనే కల 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'తో నెరవేరింది. శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా…

2 years ago

దర్శకుడు శ్రీకార్తిక్ ఇంటర్వ్యూ

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారేనా ? అవును. తను బెడ్ మీద వున్నపుడు నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో వున్నారు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు. ఆ విషయంలో రిగ్రేట్ వుండేది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కథకు భీజం వేసింది. ఎమోషన్ ని సైన్స్ లో ఎలా బ్లండ్ చేశారు ? నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇందులో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కథని సైన్స్ తో    ట్రీట్ చేశా. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. మేము అనుకున్న విజయం సాధించింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయని భావిస్తాను. శర్వానంద్ తో పని చేయడం ఎలా అనిపించింది ? శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందనినమ్మా. ఆ నమ్మకం నిజమైయింది. అమల గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత అమల గారికి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు. మీలో ఒక డ్యాన్సర్, నటుడు, దర్శకుడు, నిర్మాత వున్నారు కదా.. ఈ కోణాలు గురించి చెప్పండి ? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. అదికాకపొతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ అనుకున్నా. ఇదే సమయంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలు. నా ఎక్స్ ప్రెషన్, యాక్టింగ్ బావుందని మెచ్చుకున్నారు. నాలో ఒక నమ్మకం వచ్చింది. నటుడ్ని కావాలని చాలా తిరిగా. రెండేళ్ళు అవకాశాలు రాలేదు. తర్వాత నేనే రాయాలి నేనే తీయాలి అనే నిర్ణయానికి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా. ఒకే ఒక జీవితానికి ఐదేళ్ళు పట్టిందని చెప్పారు కదా.. మరి షూటింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు ?  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాది పట్టింది. షూటింగ్ ని త్వరగానే పూర్తి చేశాం. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా(నవ్వుతూ)…

2 years ago

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ని  ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు : సంచిత బషు ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే…

2 years ago

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. 'జాతి రత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ? నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా) `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ? ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం. ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ? చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూసిన  అనుభవాలు ఉన్నాయా ? `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ?  నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు. శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`తో మరో జాతిరత్నాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవచ్చా ? తప్పకుండా.…

2 years ago

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరో శ్రీకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతిరత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.  వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం. హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ? కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని  చాలా ఎంజాయ్ చేశా. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ? పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ? పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ) 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ? ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు. తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?…

2 years ago

నాగశౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి’ బెస్ట్ మూవీ అవుతుంది :  నిర్మాత ఉషా మూల్పూరి ఇంటర్వ్యూ

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ…

2 years ago